హైదరాబాద్: బంగారం, వెండి ప్రియులకు ఇవాళ గుడ్ న్యూస్. ఎందుకంటే వరుసగా పెరుగుతున్న ధరలు.. ఈ రోజు ఒక్కసారిగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 250, 24 క్యారెట్ల బంగారంపై రూ. 360 తగ్గింది. అలాగే వెండి కూడా భారీగా తగ్గింది. దీంతో బంగారం, వెండి కొనుగోలుదారులకు ఊరట లభించింది. ఈ రోజులు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 49,010 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 45వేలుగా విక్రయాలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ. 51,440గా ఉంది, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 47,150గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 48,200, 22 క్యారెట్ల బంగారం రూ. 47,200గా ఉంది.
బంగారం-వెండి
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 49,010గా ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ. 45వేలుగా కొనసాగుతోంది. విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
అటు వెండిపై కూడా భారీగా ధరలు తగ్గాయి. కేజీ వెండిపై రూ. 1100 తగ్గింది. తగ్గిన ధరతో కేజీ వెండి రూ. 73,200గా ఉంది.