తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సర్వేలు మాత్రం అన్ని బీఆర్ఎస్ కు అనుకూలంగా వస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో BRS పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వస్తుందని ‘గ్రౌండ్ జీరో రీసెర్చ్ సర్వే’ లో వెల్లడైంది. ఈ సంస్థ సర్వేలో BRSకు 66 సీట్లు, కాంగ్రెస్‌కు 43 సీట్లు, ఎంఐఎం పార్టీకి 6 సీట్లు, బీజేపీకి 4 సీట్లు వస్తాయని తేలింది. ఓటింగ్ శాతం విషయానికొస్తే BRSకు 42 శాతం, కాంగ్రెస్ పార్టీకి 37 శాతం, ఎంఐఎంకు 3 శాతం, బీజేపీకి 8 శాతం, ఇతరులకు 10 శాతం వస్తాయని గ్రౌండ్ జీరో రీసెర్చ్ సర్వే పేర్కొంది. దీంతో తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని తేలిపోయింది.