గత రెండు రోజులుగా ది రాజాసాబ్ సినిమా సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ లో ఉన్న విషయం తెల్సిందే. అందుకు కారణం రాజాసాబ్ నుంచి గ్లింప్స్ వస్తుంది అని తెలియడమే. ఇక ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితమే ఈ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రాజాసాబ్.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. హర్రర్ కామెడీ జోనర్ లో మొట్టమొదటిసారి ప్రభాస్ నటిస్తున్నాడు. దీంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
ఇక గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఇదంతా పక్కన పెడితే.. రిలీజ్ డేట్, ప్రభాస్ లుక్ రివీల్ చేశారు కానీ, ప్రభాస్ సరసన నటించే హీరోయిన్స్ ఎవరు అన్నది మేకర్స్ రివీల్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. కాదు కాదు.. ట్రెండింగ్ గా మారింది.
అదేంటంటే.. రాజాసాబ్ సినిమాలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కనిపించనుందట. ఇప్పటికే మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది కానీ, అధికారికంగా ప్రకటించలేదు. ఆమెతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని టాక్.
ఇక ఆ ముగ్గురు కాకుండా నిధి కూడా కనిపించనుందని అంటున్నారు. వీరిద్దరి మధ్య రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని టాక్. అయితే మెయిన్ హీరోయిన్ నిధినా ..? కాదా..? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ఫ్యాన్స్ కు పండగే అని చెప్పుకోవాలి. మరి ఇందులో నిజమెంత తెలియాలంటే మేకర్స్ స్పందించాల్సిందే