తేది:14-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota abhilash.
మెదక్ జిల్లాలో ఆదివారం నిర్వహిస్తున్న రెండో విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పోలీసుల మానవీయ సేవాభావం మరోసారి వెలుగులోకి వచ్చింది. మెదక్ మండలం పాతూర్ గ్రామంలోని పోలింగ్ బూత్ వద్ద నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని అక్కడ విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్ సుగెందర్ చేతులపై ఎత్తుకొని సురక్షితంగా పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లారు. ఆమె తన ఓటు హక్కును ఇబ్బంధి లేకుండా వినియోగించుకునేలా సహకరించారు.
ఎన్నికల సమయంలో వృద్ధులు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఓటింగ్‌లో పాల్గొనాలనే ఉద్దేశంతో పోలీసులు అందిస్తున్న ఈ సహాయక చర్యలకు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదనే సందేశాన్ని ఈ ఘటన స్పష్టంగా చాటుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.