ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై పోలీసు కస్టడీలో ఉన్న భుజంగరావు, తిరుపతన్నల కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను విశ్లేషించడంపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. ఈ మేరకు వీరికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను పోలీసు అధికారులు ఇప్పటికే జప్తు చేశారు. వాటితోపాటు వారి సెల్‌ఫోన్లలోని డేటాను విశ్లేషిస్తున్నారు. ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముందుకెళ్లేందుకు సాంకేతిక ఆధారాల సేకరణ అవశ్యం కావడంతో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.