
తేది:12-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇన్చార్జ్ వల్లే ప్రశాంత్.
ఉమ్మడి వరంగల్ జిల్లా:మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ స్వంత గ్రామంలో వెలుగు చూసిన ఉదంతం.
పంచాయతి ఎన్నికలలో సోమ్లాతండ సర్పంచ్ గా పోటీచేసి ఓడిపోయిన మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళినాయక్ స్వంత వదిన.
ఓట్లకోసం ఇచ్చిన డబ్బులను ఎమ్మెల్యే మురళీనాయక్ సోదరుడు, వారి కుటుంబసభ్యులు, కాంగ్రెస్ నాయకులు కలిసి వసూలు చేస్తున్నారంటూ మండిపడుతున్న తండావాసులు.
మా కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడి ఓటుకు పదిహేను వందల రూపాయలు ఇచ్చారు.ఇప్పుడు దౌర్జన్యంగా రికవరీ చేస్తున్నారంటూ బహిరంగ విమర్శలు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు.