ఖమ్మం పార్లమెంట్ టికెట్ కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొంది. ఓ వైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఆయన వియ్యంకుడు రఘురామిరెడ్డి పోటీలో ఉన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్, స్థానిక నాయకులు రాజేంద్రప్రసాద్, లోకేశ్ యాదవ్ పేర్లు సీఈసీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై నేడో రేపో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.