కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు.

తేదీ: 13-12-2025 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు

సంగారెడ్డి జిల్లా పరిధిలోని జీహెచ్‌ఎంసీ అమీన్పూర్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు.
అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, బీరంగూడ దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ అభిమానులు, కేఎస్‌జీ యువసేన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వేడుకల్లో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో జన్మదిన వేడుకలు జరగడం ఆనందంగా ఉందని తెలిపారు. భగవంతుని కృపతో కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరోగ్యవంతంగా, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలు కలిగి దీర్ఘాయుష్షుతో ఉండాలని వారు ఆకాంక్షించారు.
ఇక ముందు కాలంలో కాటా శ్రీనివాస్ గౌడ్ మరింత కీలక బాధ్యతలు స్వీకరించి, పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధికి తన సేవలను మరింత విస్తరించాలని కోరుతూ, ఆయనకు దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని నాయకులు ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మున్న, మన్నే రవీందర్, రమేష్ యాదవ్, బిక్షపతి, చంద్రశేఖర్, మల్లేష్, ఈశ్వర్ రెడ్డి, లక్ష్మీకాంత్ పంతులు, మహేష్, శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాస్, చుక్క రెడ్డి, సుదర్శన్, సింగ్, కేఎస్‌జీ యువసేన సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *