భార్యను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టి, ఆపై భర్త ఉరేసుకొని మృతి.

తేది:13-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.

ఉమ్మడి వరంగల్ జిల్లా: జయశంకర్ భూపాలపల్లి ఉమ్మడి వరంగల్ జిల్లా లో దారుణం చోటుచేసుకుంది. గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి (50) తన భార్య సంధ్యను ఉరి వేసి హత్య చేశాడు. ఆ తరువాత భార్య, కూతురు వేధింపులు తట్టుకోలేక ఈ ఘాతుకానికి పాల్పడ్డానంటూ ఒక వీడియోను రికార్డ్ చేసి వాట్సాప్ స్టేటస్గా పెట్టాడు. అనంతరం తానూ ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *