తేది:12-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash.
మెదక్ జిల్లా:రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భగా మెదక్ జిల్లా పోలీసు శాఖ విస్తృత బందోబస్తును ఏర్పాటు చేసింది. డిసెంబర్ 12, 2025 సాయంత్రం 5 గంటల నుండి జిల్లాలో సైలెంట్ పీరియడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు.
ఎన్నికల శాంతిభద్రతల కోసం 163 BNSS (144 సెక్షన్)ను అమలు చేస్తూ, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో గుంపులు, సమావేశాలు నిషేధం చేసింది. ఈ నేపథ్యంలో ప్రచార ర్యాలీలు, సమావేశాలు, ప్రజా గుమికూడింపులు పూర్తిగా నిషేధితమయ్యాయి.
జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు అవసరమైన పోలీస్ ఫోర్స్‌ను మోహరించామని, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు వెల్లడించారు. పోలీసులు ప్రతి పోలింగ్ కేంద్రంపై నిశితంగా నిఘా ఏర్పాటు చేసి, చట్ట ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.