మయన్మార్‌‌లో సివిల్ వార్…

భారత ఈశాన్య పొరుగు దేశమైన మయన్మార్‌ నుంచి భారత భూభాగంలోకి అక్కడి నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, సైనికులు శరణార్థులుగా వస్తున్నారు. దీంతో భారత ప్రభుత్వం ఒక్కసారిగా alert అయింది.

 

మయన్మార్‌కు భారత సరిహద్దు రాష్ట్రమైన మిజోరాం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా అంటున్నారు.

 

అసలు మయన్మార్‌లో సమస్య ఏంటి? ఆ దేశం నుంచి ప్రజలు, సైనికులు ఎందుకు ఇండియాకు వచ్చి తలదాచుకుంటున్నారు. దీనికి కారణాలేంటో ఒకసారి చూద్దాం.

 

మూడేళ్లుగా మయన్మార్‌‌లో Civil war అంటే అంతర్యుద్ధం జరుగుతోంది. ఫిబ్రవరి 1, 2021లో మయన్మార్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని జుంటా ఆర్మీ కూలగొట్టింది. మయన్మార్‌లో ప్రభుత్వ సైన్యాన్ని జుంటా ఆర్మీ అని అంటారు.

 

అప్పటి వరకు State Councillorగా ఉన్న ప్రజా నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ, మయన్మార్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన ‘విన్ మింట్‌’తో సహా అందరూ రాజకీయ నేతలను అరెస్టు చేశారు.

 

 

అక్కడ ఎమర్జెన్సీ విధించి మిలిటరీ లీడర్ అయిన ‘మిన్ ఆంగ్ హాలింగ్’ తనను తాను మయన్మార్ శాసకుడిగా.. ఆ దేశ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. మయన్మార్‌లో రెండేళ్ల వరకు ఎమర్జెన్సీ కొనసాగుతుందని ఆయన చెప్పారు. అంతకుముందు నవంబర్ 2020లో ఆంగ్ సాన్ సూకీ పార్టీ ఎన్నికల్లో 396 సీట్లు గెలుచుకొని భారీ విజయ సాధించింది. మరోవైపు ప్రత్యర్థి పార్టీ అయిన Union Solidarity and Development Partyకి కేవలం 33 సీట్లు లభించాయి.

 

అయితే ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీకి అక్కడి సైన్యం(జుంటా ఆర్మీ) full support చేసింది. అందుకే ఎన్నికలు గెలిచిన సూకీ పార్టీ అవినీతికి పాల్పడిందని.. మోసపూరితంగా ఎన్నికలు గెలిచిందని ఆరోపణలు చేసింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సూకీ పార్టీకి అక్కడి జుంటా ఆర్మీకి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ కారణంగానే సూకీ పార్టీ లీడర్లను అరెస్టు చేసి జుంటా ఆర్మీ చీఫ్ మయన్మార్‌లో అధికారం చేజిక్కించుకున్నారు. ఆ తరువాత తనకు అడ్డు వచ్చిన వారందరినీ హత్య చేయించారు. ఆ సమయంలో చైనా సహాయంతోనే ఇదంతా నడిచింది.

 

ఇక్కడ మీకో doubt రావొచ్చు.. అంగ్ సాన్ సూకీకి నోబెల్ Prize లభించింది. ఆమె ఒక పార్టీ అధ్యక్షురాలు.. మరి ఆమె పార్టీ విజయం సాధిస్తే.. ఆమె స్వయంగా మయన్మార్ ప్రెసిడెంట్‌ పదవి ఎందుకు చేపట్టులేదని. ఇది కూడా ఈ జుంటా ఆర్మీ ఘనకార్యమే. ఆంగ్ సాన్ సూకీ ఒక బ్రిటీష్ పౌరుడిని వివాహం చేసుకుంది. దీంతో మరో దేశ పౌరుడిని వివాహం చేసుకున్న వారు.. దేశ అధ్యక్ష పదవిని చేపట్టకూడదని దేశ రాజ్యాంగంలో చట్టం తీసుకొచ్చింది జుంటా ఆర్మీ. అందుకే సూకీ తన పార్టీ తరపున ‘విన్ మింట్‌’ని ప్రెసిడెంట్ చేసి.. తాను మాత్రం state councillorగా వ్యవహరిస్తోంది. కానీ ఇప్పుడు ఆమె మళ్లీ జైల్లో ఉంది.

 

 

దీంతో మయన్మార్‌లో ప్రజా ఉద్యమం మొదలైంది. మయన్మార్‌లోని పలు ప్రాంతాలలో జుంటా ఆర్మీకి వ్యతిరేకంగా విద్రోహ గ్రూపుల తయారయ్యాయి. వీటిలో జుంటా ఆర్మీలో పనిచేసే కొంతమంది సైనికులు కూడా చేరారు. వారంతా కలిసి రెబెల్ ఆర్మీలుగా ఏర్పడ్డారు. ఈ రెబెల్ ఆర్మీలన్నీ సంయుక్తంగా Peoples Defense force అంటూ ఒక powerful armyగా ఏర్పడి జుంటా ఆర్మీతో పోరాటం మొదలుపెట్టాయి. ఈ Peoples Defense force లో democracy కోసం పోరాడే సూకీ పార్టీ కార్యకర్తలు, యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

 

 

ఈ Peoples Defense force కోసం పనిచేసే రెబెల్ ఆర్మీల స్థావరాలపై ప్రభుత్వ జుంటా ఆర్మీ దాడులు చేస్తోంది. ప్రజా స్వామ్యం కోసం లేవనెత్తే గొంతులను అణచివేసే ప్రయత్నంలో.. రెబెల్ ఆర్మీలకు సహాయం చేసే గ్రామాలలో అమాయక ప్రజలపై జుంటా ఆర్మీ బాంబులు కురిపించింది. ఈ బాంబుల దాడిలో చిన్నపిల్లలు, ఆడవాళ్ల శవాలు.. కుప్పలుగా పేరుకుపోయాయి.

 

ఈ రెబెల్ ఆర్మీలో చేరే యువతను మయన్మార్ లోని చిన్ రాష్ట్రంలో మిలిటరీ శిక్షణ ఇస్తున్నారు. ఈ చిన్ రాష్ట్రం భారత దేశ సరిహద్దులో ఉంది. భారత దేశంలోని మిజోరం పక్కనే ఈ చిన్ రాష్ట్రం ఉంది.

 

 

మయన్మార్‌లో గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ జుంటా ఆర్మీ, Peoples Defense force దళాల మధ్య ఈ వార్ నడుస్తూనే ఉంది. దీంతో ఆ దేశంలో స్థిరత్వం లేక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. మయన్మార్‌లోని రాజధాని ‘Nyapidaw'(న్యాపిదే) తప్ప మరే రాష్ట్రంలోనూ జుంటా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు లేరు. Peoples Defense forceకు సంబంధించిన రఖైన్ ఆర్మీ, క్మాంప్ విక్టోరియా, అరాకన్ ఆర్మీలకు దేశంలోని 50 శాతానికి పైగా ప్రజలు బహిరంగంగానే మద్దతు తెలుపుతున్నారు.

 

ఈ ప్రజాబలంతో Peoples Defense force దళాలు జుంటా ఆర్మీపై విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని వందకుపై జుంటా సైన్య స్థావరాలను ఆక్రమించుకొని.. వారి ఆయుధాలను దోచుకున్నాయి. ఈ రెబెల్ ఆర్మీల దెబ్బకు పలు చోట్ల జుంటా సైనికులు పోరాడకుండానే సమర్పణ చేస్తున్నాయని సమాచారం. ఇలా వందల సంఖ్యలో జుంటా సైనికులు ప్రాణాలు కాపాడుకొని భారతదేశంలోకి ప్రవేశిస్తున్నారు.

 

భారతదేశంలోని మిజోరం రాష్ట్రంలోని ఆరు జిల్లాలు.. చంఫాయి, సియాహా, లాంగ్‌టలాయి, సెర్‌ఛిప్, హనాథియాల్, సైతుఅల్.. మయన్మార్ దేశంతో 500 కిలోమీటర్ల పొడవున border ఉంది. దీంతో మయన్మార్ నుంచి 2021 ఫిబ్రవరి నుంచి శరణార్థులు వస్తున్నారు.

 

మిజోరం ప్రభుత్వం నివేదిక ప్రకారం.. ఇప్పటివరకు 31,634 మంది మయన్మార్ పౌరులు ఇండియాలో శరణార్థులుగా వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *