*న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్ ను ఆశ్రయించిన మెదక్ పార్లమెంట్ జహీరాబాద్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీలు సంగారెడ్డి జిల్లా బీసీవై పార్టీ ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మరియు జి సాయ గౌడ్.
న్యూఢిల్లీ, రాష్ట్రపతి భవన్ కార్యాలయంలో స్వతంత్ర సమరయోధుల ఆశయాల కోసం ఏర్పాటుచేసిన ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ క్షేత్ర నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి ఢిల్లీ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి మురుముర గారి కార్యాలయం దృష్టికి మెదక్ పార్లమెంట్ జహీరాబాద్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీలు సంగారెడ్డి జిల్లా బీసీవై పార్టీ ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ గారు మరియు జి సాయ గౌడ్ గారు తీసుకెళ్లారు. ఇట్టి విషయంలో రాష్ట్రపతి భవన్ కార్యాలయం ఇన్చార్జ్ గతంలో ఇచ్చిన పిటిషన్ యొక్క ప్రస్తుత స్టేటస్ ను తెలియపరచి పనులను మరింత వేగవంతంగా చేసేందుకు ఇచ్చిన పిటిషన్ను పరిగణలోకి తీసుకొని రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకెళ్లి ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆశయాల సాధనకు తమ వంతు బాధ్యతగా తెలియపరుస్తామని తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల క్షేత్ర నిర్మాణంలో భాగంగా వివిధ సంఘాల నాయకులు మరియు రాజకీయ నేతలు పాల్గొన్నారు.