*స్వతంత్ర సమరయోధుల విలువలు తెలియకుండా వ్యవహరించిన రెవెన్యూ ప్రభుత్వ అధికారులకు గత ప్రభుత్వం బిఆర్ఎస్ నాయకులకు త్వరలో జైలు శిక్ష- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.
న్యూఢిల్లీ, ప్రధానమంత్రి కార్యాలయము మరియు కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా కార్యాలయమును ఆశ్రయించిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చేందుకు మద్దతుగా ఉన్న భారత కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఇట్టి తరుణంలో ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆశయాల సాధనలో భాగంగా క్షేత్ర నిర్మాణ పనులకు అడ్డుకున్నటువంటి సదాశివపేట రెవెన్యూ అధికారుల ఛాయా చిత్రాలను, పత్రికా నివేదికలను దృష్టిలో ఉంచుకొని జంతర్ మంతర్ వద్ద అధికారికంగా భారీ ఎత్తున ధర్నా నిర్వహించి అన్ని పార్టీల వారికి ధర్నాలో భాగంగా స్వాగతం పలికి అందరి సమక్షంలో మూర్ఖత్వంగా, స్వాతంత్ర సమరయోధుల విలువలు తెలియకుండా వ్యవహరించి అడ్డుపడిన అధికారుల ఛాయాచిత్రాల బొమ్మలను దహనం చేస్తామని అదేవిధంగా తగిన చట్టపరమైన జైలుశిక్ష పడే వరకు ఉద్యమాలు ఆందోళనలు కొనసాగుతాయని తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాల క్షేత్ర నిర్మాణ సాధనలో భాగంగా ప్రధానమంత్రి కార్యాలయంను మరియు కేంద్ర హోం శాఖ మినిస్టర్ అమీషా గారి కార్యాలయమును సందర్శించిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ జి సాయ గౌడ్, స్వాతంత్ర సమరయోధుల ఆశయాల కోసం పోరాడుతున్న సంఘాలు మరియు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.