*స్వాతంత్ర సమరయోధుల ఆశయాల సాధన క్షేత్ర నిర్మాణ ట్రస్ట్ కరపత్రాన్ని ఆవిష్కరించిన- జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినేతలు.
న్యూఢిల్లీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుల ఆశయాల సాధన కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ కరపత్రాన్ని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినేతల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ యొక్క స్వతంత్ర సమరయోధుల ఆశయాల సాధన కోసం ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ క్షేత్ర నిర్మాణంలో భాగంగా కరపత్రములను ఆవిష్కరించిన సమావేశంలో భాగంగా బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అతిశర వేగంగా ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ క్షేత్రస్థాయి పనులు జరుగుటకు భారతదేశ ప్రజలు నలుమూలల నుండి భాగస్వాములై స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చే దిశలో ముందుకు వెళ్లాలని కొనియాడారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవినీతిని నిర్మూలించడానికి చేపట్టిన హైడ్రాను స్వాగతిస్తున్నామని తెలియజేశారు. త్వరలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో, ప్రజాస్వామ్య విలువలు తెలవకుండా, స్వాతంత్ర సమరయోధుల విలువలు తెలియకుండా మూర్ఖత్వంగా వ్యవహరించి అవినీతికి పాల్పడ్డ కొందరు నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు జైలు పాలవడం ఖాయమని సంబంధిత ఆధార పూరితమైన పత్రికా నివేదికలను దృష్టిలో ఉంచుకొని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ క్షేత్రస్థాయి స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చుటలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారు, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు, ప్రముఖ కీలక కాంగ్రెస్ పార్టీ రాజకీయ నేతలు మైనంపల్లి హనుమంతరావు, మధుయాష్కి గౌడ్, మహేష్ గౌడ్, తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తూర్పు నిర్మల జగ్గారెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర వివిధ పార్టీల ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు వెన్నంటూ ఉండి క్షేత్రస్థాయి అభివృద్ధికి తోడ్పడుతామని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ కాంటెస్టెడ్ ఎంపీ జి సాయ గౌడ్, మరియు వివిధ రాష్ట్రాల ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ నేతలు, వివిధ సంఘాల నుండి ప్రముఖులు పాల్గొన్నారు.