తేది:14-04-2026 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా :పురస్కరించుకొని మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, హనుమకొండ జిల్లా కలెక్టర్ మరియు బల్దియా ఇన్‌చార్జి కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్ గారితో కలిసి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ డా. అంబేద్కర్ గారి ఆలోచనలు, రాజ్యాంగ పరిరక్షణకు చేసిన కృషి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
అనంతరం, ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలోని “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో మేయర్, కలెక్టర్ పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ప్రతిజ్ఞలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్, సి.హెచ్.ఓ రమేష్, పి.ఆర్.ఓ ఆయుబ్ అలీ, ఇన్‌చార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, ఎం.హెచ్.ఓ డా. రాజేష్, జేఏసీ అధ్యక్షులు బోట్ల రమేష్, గౌరవ అధ్యక్షులు బాకం సంతోష్, ఎల్పుల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.