టాలీవుడ్లో విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నారా రోహిత్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుక అందించారు. తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఫన్-ఫిల్డ్ అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘సౌండ్ ఇంజనీర్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.
చినిమిల్లి మణికుమార్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్గా నటిస్తుండగా, ప్రముఖ నటుడు నరేష్ విజయకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భరత్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.