‘రెసిడెంట్ ఈవిల్’ రీబూట్ ట్రైలర్ విడుదల.. సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్

ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ వీడియో గేమ్ ఫ్రాంచైజీ ఆధారంగా తెరకెక్కుతున్న ‘రెసిడెంట్ ఈవిల్’ రీబూట్ చిత్రానికి సంబంధించిన అధికారిక ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సర్వైవల్ హర్రర్ థ్రిల్లర్ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

‘బార్బేరియన్’, ‘వెపన్స్’ వంటి ప్రశంసలు పొందిన చిత్రాల దర్శకుడు జాచ్ క్రెగర్ ఈ రీబూట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. జాచ్ క్రెగర్‌తో కలిసి షే హాటెన్ ఈ చిత్రానికి కథను అందించగా, హర్రర్ అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ సినిమాను రూపొందించారు.

ప్రముఖ వీడియో గేమ్ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం కల్పిత అమెరికన్ నగరం రాకూన్ సిటీ నేపథ్యంలో సాగుతుంది. జోంబీలతో నిండిన భయానక వాతావరణం, ఉత్కంఠభరితమైన కథతో ఈ రీబూట్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.