జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు – ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

తేది:14-04-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: సమాజంలో అన్ని వర్గాలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, గౌరవం కల్పించిన మహోన్నత వ్యక్తి డా.బాబా సాహెబ్ అంబేద్కర్: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్
సామాజిక వివక్షను జయించి, అత్యున్నత విద్యను సాధించిన గొప్ప మేధావిగా ,భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉండడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు అని జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు అన్నారు. భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారు అంబేద్కర్ గారి చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారూ మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం కల్పిస్తూ భారత దేశ అభివృద్ధికి, అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి గా అభివర్ణించారు. భారతీయ సమాజంలో కూడా దళితులు, పేదలు, మహిళల కు సమాజంలో సమాన గౌరవం కల్పించే దిశగా రాజ్యాంగ కల్పన చేసిన వ్యక్తి గా అభివర్ణించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే కాకుండా, సామాజిక సమానత్వం, స్వాతంత్య్రం, విద్య, శ్రామిక హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని ఆయన భావాలు సమాజ అభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తాయిని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి ఆశయాలను అనుసరిస్తూ సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి అని పేర్కొన్నారు.
ఈ యొక్క కార్యక్రమo లో డిఎస్పి వెంకటరమణ,SB ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్ ,సైదులు, ఎస్.ఐ లు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *