మహిళల ఆసియా కప్ 2026లో భారత్ ఘన విజయంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. థాయ్‌లాండ్‌తో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో టీమిండియా 94 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తన కెరీర్‌లో 150వ టీ20ఐ మ్యాచ్ ఆడిన దీప్తి శర్మ.. బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. కేవలం 7 బంతుల్లోనే 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసింది. అంతేకాదు.. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఈ ఘనత సాధించడం విశేషంగా మారింది. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
150వ టీ20ఐ మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మార్చుకున్న దీప్తి శర్మ.. తన అనుభవంతో థాయ్‌లాండ్ బ్యాటర్లను పూర్తిగా కట్టడి చేసింది. భారత జట్టు భారీ విజయాన్ని అందుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఈ ప్రదర్శనతో దీప్తిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.