సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన తాజా చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.
ఈ వేడుకలో విజయ్ దేవరకొండ.. సందీప్ రెడ్డి వంగాతో తనకున్న అనుబంధం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. తమది కేవలం హీరో-డైరెక్టర్ బంధం కాదని, సోదరులు, స్నేహితుల కంటే కూడా తమ అనుబంధం ఎక్కువని చెప్పారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా కోసం తామిద్దరం ఒక యుద్ధమే చేశామని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తమ దగ్గర డబ్బులు, పేరు, ఇన్‌ఫ్లుయెన్స్ ఏవీ లేవని తెలిపారు.
సందీప్ రెడ్డి వంగా కుటుంబం తమ పొలాన్ని అమ్మేసి తనను నమ్మి ‘అర్జున్ రెడ్డి’ సినిమాను నిర్మించిందని విజయ్ వెల్లడించారు. “నాకోసం సందీప్, సందీప్ కోసం నేను ఎక్కడిదాకా అయినా వెళ్తాం. సందీప్ పిలిస్తే ఈ ఈవెంట్‌కు రాకుండా ఉండలేను” అంటూ తన స్నేహాన్ని చాటుకున్నారు. విజయ్ దేవరకొండ చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.