భారత్‌కు కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. ఢిల్లీలో భారీ నిరసనలకు పిలుపు..

ఎట్టకేలకు ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగేసింది కాక్రోచ్ జనతా పార్టీ. ఢిల్లీలో జూన్ 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు ఫౌండర్ అభిజిత్ దీప్కే. ఈ ధర్నాలో యువత పాల్గొవాలని ఆయన పిలుపు ఇచ్చారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలన్నది ఆయన ప్రధాన డిమాండ్.

 

ప్రత్యక్ష కార్యాచరణలోకి కాక్రోచ్ జనతా పార్టీ

 

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే ఇండియాలో అడుగుపెట్టనున్నారు. కేంద్రప్రభుత్వంపై ఆయన యుద్ధాన్ని ప్రకటించేశారు. నీట్, సీబీఎస్ఈ పరీక్ష విషయంలో నైతిక బాధ్య‌త వహించి కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌న్నది ప్రధాన డిమాండ్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశాడాయన.

 

ఈ కార్య‌క్ర‌మంలో మ‌ద్ద‌తుదారులు, విద్యార్థులు పాల్గొవాల‌ని కోరారు. అంద‌రూ ద‌గ్గ‌ర‌కు రావాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ప్రస్తావించాడు. రాజ్యాంగం అడుగు జాడ‌ల్లో మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేద్దామని, మ‌న గ‌ళం విప్పితే, దానికి వాళ్లు త‌ప్ప‌కుండా వింటార‌ని మనసులోని మాట బయటపెట్టారు.

 

జంతర్ మంతర్ వద్ద ధర్నా, యువత హాజరు కావాలని పిలుపు

 

జూన్ 6న మ‌ద్ద‌తుదారులంద‌రూ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల‌ని వీడియోలో పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి అందరూ కలిసి పార్ల‌మెంట్ స్ట్రీట్ పోలీసు స్టేష‌న్‌కు వెళ్దామ‌ని పేర్కొన్నాడు దీప్కే. జంత‌ర్ మంత‌ర్‌లో శాంతియుత ప్ర‌ద‌ర్శ‌న కోసం ప‌ర్మిష‌న్ కోరుదామని తెలిపారు.

 

నీట్, సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల విషయంలో విద్యార్థులు ఆందోళ‌న చెందుతున్నార‌ని, దీనికి ప్ర‌భుత్వం బాధ్య‌త తీసుకోవాల‌న్నారు. సోష‌ల్ మీడియా ద్వారా కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఏర్ప‌డింది. ఆ పార్టీని స‌బ్‌స్క్రైబ్ చేసిన సంఖ్య కోటికి పైగానే ఉంది. యువత ధర్నాకు వస్తుందా? అన్నదే పెద్ద ప్రశ్న. ధర్నాకు పోలీసులు పర్మీషన్ ఇస్తారా? మరొక ప్రశ్న.