కడప ఉపఎన్నిక చిచ్చు..!

కడప బైపోల్ వ్యవహారం జగన్ ఫ్యామిలీలో చిచ్చుపెట్టిందా? దీనిపై ఆయనెందుకు సైలెంట్‌గా ఉన్నారు? ఇప్పటివరకు ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం ఎందుకు జరగలేదు? భారతి కోసమే శాసనసభా పక్ష సమావేశాన్ని పెండింగ్‌లో పెట్టారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడు తున్నాయి. ఈ లెక్కన జగన్‌కు ఇంటి పోరు మొదలైనట్టేనా?

 

ఏపీలో ఎన్నికలు ముగిశాయి.. ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. రేపోమాపో అసెంబ్లీ సమావేశాలకు రెడీ అవుతోంది పాలకపక్షం. ఇప్పటివరకు వైసీపీ శాసనసభ పక్షం సమావేశం కాలేదు. శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు జగన్‌ను ఎన్నుకున్న సందర్భంలేదు. ఎందుకు డిలే చేస్తున్నారన్నది అసలు ప్రశ్న. కడప ఉపఎన్నికకు సంకేతామా? అనే ప్రశ్న రైజ్ అవుతోంది.

 

కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా? ఈ విషయంపై జగన్ ఫ్యామిలీలో చర్చలు జరుగుతున్నాయట. జగన్ ఫ్యామిలీ సభ్యులు అవినాష్‌ను కన్వీన్స్ చేసే పనిలోపడినట్టు పులివెందుల వైసీపీ నేతల సమాచారం. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే.. కడప ఎంపీగా జగన్ పోటీ చేయాలని భావిస్తున్నారట. పులివెందుల అసెంబ్లీ నుంచి వైఎస్ భారతిని రంగంలోకి దించాలని ఆలోచన చేస్తున్నట్లు అంతర్గత సమాచారం. అలా చేస్తే అవినాష్‌ను తప్పించినట్టు ఉంటుందని, తనపై ఫ్యామిలీ సభ్యులకు ఉన్న కోపం తగ్గుతుందని భావిస్తున్నారట జగన్‌బాబు.

 

2024, మే 13 నాటికి ఒక్కసారి వెళ్దాం.. ఎన్నికల ప్రచారంలో అప్పటి కడప వైసీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ప్రచారంలో పలుమార్లు నోరు జారారు. ఎమ్మెల్యే ఓటు ఎవరికైనా వేయండి.. ఎంపీ ఓటు మాత్రం తనకే వేయాలని టంగ్ స్లిప్ అయ్యారట. అంతేకాదు విపక్ష నేతల పోలింగ్ ఏజెంట్లకు ఫోన్ చేసి తనకు సహాయం చేయాలని కోరినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తానికి వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఈ విషయంలో నోరు విప్పేవరకు ప్రచారం ఆగినట్టు లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *