అగ్నిహోత్రం జీవన విధానానికి మూలాధారం- బిసివై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

 

  •  సామూహికంగా అగ్నిహోత్ర ప్రచారం చేస్తున్న విశ్వ ఫౌండేషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన-బిసివై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

 

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లో బిజెపి పార్టీ మండల ఉపాధ్యక్షులు పల్లె మల్లేష్ గౌడ్ స్వగృహం నందు అగ్నిహోత్రమును విశ్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న బిసివై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ నిత్య అగ్నిహోత్రం జీవన విధానానికి మూలాధారమని, సమ సమాజ సంరక్షణ కోసం ఎంతో ఉపయోగకరమని అదేవిధంగా నిత్యాఅగ్నోత్రం ఆచరిస్తే విశ్వం మనకు కావాల్సిన శక్తి సామర్థ్యాలను మరియు జ్ఞానాన్ని సమకూరుస్తుందని తెలియజేశారు. ఈ యొక్క అగ్నిహోత్రంమును కులమత జాతి విభేదం లేకుండా అందరూ ఆచరించవచ్చు అని తెలియజేశారు. తద్వారా భారతదేశము ప్రపంచ దేశాలకు ఆదర్శ దేశంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెలవు దినాల్లో నిత్య అగ్నిహోత్ర ప్రచారం చేస్తున్న విశ్వ ఫౌండేషన్ ప్రచార కమిటీ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ విశ్వ ఫౌండేషన్ కు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలియజేశారు. తదన అనంతరం విశ్వ ఫౌండేషన్ వారు పర్యావరణాన్ని కాపాడడం కోసం, సంస్కృతిని కాపాడడం కోసం, మంచి జీవన విధానాన్ని కొనసాగించడం కోసం నిత్య అగ్నిహోత్రాన్ని సామూహికంగా అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో నిత్య అగ్నిహోత్రము ఆచరించే సభ్యులు మరియు విశ్వ ఫౌండేషన్ ప్రచార కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *