మాజీ మంత్రి జోగి రమేశ్ పై కేసు నమోదు అయ్యింది. చంద్రబాబు నివాసంపై ఆయన దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. జోగి రమేశ్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును హైకోర్టులో ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
మాజీ మంత్రి జోగి రమేశ్‌ను కేసులు వెంటాడుతున్నాయి. అధికారంలో ఉండగా ఇష్టానుసారంగా వ్యవహరించారు మాజీ మంత్రి జోగి రమేష్. చంద్రబాబు నివాసంపై వందల మంది కార్యకర్తలతో దాడికి ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో సీజ్ చేసిన భూమిని అక్రమంగా రాయించుకున్నట్లు జోగి ఫ్యామిలీపై ఆరోపణలున్నాయి.
విజయవాడ పాయకరావుపేట సమీపంలో 26 సెంట్ల స్థలాన్ని సర్వే నెంబర్ మార్పుతో రిజపిస్ట్రేషన్ చేయించుకున్నాడని టాక్ ఉంది. జోగి రమేష్ అక్రమాలపై పోలీసులు విచారించి ఆ నివేదికను డీజీపీకి సమర్పించారు. ఈ కేసులకు సంబంధించి విచారణను సీబీఐ లేదా సీఐడీకి అప్పగించే అవకాశం ఉందని సమాచారం ఉంది. ఈ కేసులో జోగి రమేష్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై ఇవాళ విచారణ జరిపే అవకాశం ఉంది. కేసు నమోదు అయ్యినప్పటి నుంచి జోగి రమేష్ అజ్ఞాతంలో ఉన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన నియోజకవర్గంలో ఎక్కడా కనిపించలేదు. ఫలితాల తర్వాత ఒక్కరోజు మాత్రమే జగన్ కలిశారు జోగి రమేష్.