లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు.. త్వరలో రాజకీయాల్లోకి ఎన్టీఆర్..?

దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి, వైఎస్సార్ సీపీ నేత లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కు నివాళులర్పించిన ఆమె పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అవి చర్చనీయాంశమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో మరిసోరి మంచి పరిపాలననే నడుస్తుందంటూ పరోక్షంగా ఏపీలో మూడోసారి కూడా వైఎస్సార్ సీపీనే అధికారంలోకి రాబోతుందని ఆమె పేర్కొన్నారు.

 

జూన్ 4 తరువాత జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని.. ఏపీలో మళ్లీ మంచిపాలన వస్తుందని ఆమె అన్నారు. వైఎస్ జగన్ కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో భారీ చర్చ కొనసాగుతోంది. నిజంగా జగన్ కు మద్దతు ఉందా..? ఒకవేళ ఉంటే.. చంద్రబాబుకు ఇవ్వకుండా జగన్ కు ఎందుకు ఇస్తున్నారు..? ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారా..? ఇలా రకరకాలుగా ఇరు రాష్ట్రాల్లో భారీగా చర్చలు కొనసాగుతున్నాయి. అంతుకుముందు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *