ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్లు తీసుకుంటున్న వారికి ఎన్నికల నేపథ్యంలో గందరగోళం ఎదురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ నెలలో తమకు పింఛన్లు వస్తాయా లేదా? వస్తే ఎప్పుడు వస్తాయి? తమ పింఛన్లు ఇళ్ల వద్దకే వచ్చి ఇస్తారా, లేక మళ్ళీ బ్యాంకులో వేస్తారా? ఇలా అనేకరకాల ప్రశ్నలతో గందరగోళం మధ్య పెన్షనర్లు టెన్షన్ పడుతున్నారు. అయితే జూన్ నెలకు సంబంధించిన పింఛన్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
జూన్ నెల పించన్ పంపిణీ ఇలా ఈ మేరకు పింఛన్లను జూన్ ఒకటవ తేదీన లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, నడవలేనివారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వీల్ చైర్ లోనే ఉండే వారికి మాత్రం నేరుగా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మృతి అయితే గత నెలలో బ్యాంకు ఖాతాలలో పింఛన్ డబ్బులను జమ చేయడంతో, లబ్ధిదారులు బ్యాంకులకు క్యూ కట్టారు. అక్కడ విపరీతమైన రద్దీ కారణంగా లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు. పించన్ కోసం బ్యాంకులకు వెళ్లి వడదెబ్బతో అనేకమంది వృద్ధులు మరణించారు. మరికొందరికి బ్యాంక్ అకౌంట్ల విషయంలో ఇబ్బంది ఎదురు కావడంతో నేరుగా ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ వినిపించింది.
ఎన్నికల నేపధ్యంలో పింఛన్ కష్టాలు అయినప్పటికీ ఈ నెలలో కూడా బ్యాంకు ఖాతాలోనే పింఛన్ డబ్బులు జమ చేయాలనే ప్రభుత్వనిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఏప్రిల్ నెలనుంచి గ్రామ వాలంటీర్లను పక్కనపెట్టి వారితో పింఛన్లు పంపిణీ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో ఏప్రిల్ మాసంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేశారు. ఇక మే నెలలో బ్యాంక్ అకౌంట్లో పింఛన్ వేశారు.
జూన్ లో పింఛన్ పంపిణీపై కీలక నిర్ణయం జూన్లో కూడా బ్యాంక్ అకౌంట్ ల ద్వారానే పింఛన్ చెల్లించాలని నిర్ణయించారు. అయితే జూన్ 1వ తేదీన లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పింఛన్ పంపిణీ చేయాలని, పింఛన్ దారులు ఎండలో పింఛన్ సొమ్ము కోసం నానా అగచాట్లు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం మళ్లీ బ్యాంకు ఖాతాల లోనే పింఛన్ సొమ్ము జమ చేయాలని నిర్ణయించింది.