అయోధ్యలో భవ్య రామమందిరం ప్రాణ ప్రతిష్టకు గడువు సమీపిస్తోంది. దీంతో ఆలయ నిర్మాణంతోపాటు, రామాలయ నిర్మాణ సాంకేతికత, రాముల వారికి వస్తున్న కానుకలపై నిత్యం వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఇంజినీరింగ్ అద్భుతాలు ఆసక్తి రేపుతున్నాయి. ఆలయ నిర్మాణానికి ఒక్క ఇనుప ముక్క కూడా వాడకుండా పూర్తిగా రాతితో నిర్మించారు. ఇదే విశేషం అనుకుంటే.. ఆలయ పునాది మరింత అద్భుతం.. ఇనుము, ఉక్కు, సిమెంటు వంటివి ఏ ఆధునిక వస్తువులను వాడకుండా, వేళ ఏళ్లు ఎలాంటి పరిస్థితిని అయినా తట్టుకునేలా రామాలయ నిర్మాణం జరుగుతోంది.
More
From National politics
ప్రపంచ వ్యాప్తంగా చర్చ..
సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్య నగరంలో అద్భుతమైన రామమందిర నిర్మాణం జరిగింది. బాల రాముడు జనవరి 22 నుంచి పూజలు అందుకోనున్నాడు. అయితే ఇప్పుడు అయోధ్య రామ మందిరంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎలాంటి సిమెంట్, ఇనుము లేకుండా దీని నిర్మాణం ఎలా జరిగిందనేది తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
పవిత్ర నగరం అయోధ్య..
రామమందిర నిర్మాణం జరిగిన అయోధ్య స్వయంగా శ్రీరాముడు నడయాడిన నేల. హిందూ మతంలోని ఏడు పవిత్ర నగరాల్లో అయోధ్య ఒకటి. ఇది శ్రీరాముడి జన్మస్థలం. శతాబ్దాలుగా ఈ ప్రదేశంలోని బాబ్రీ మసీదు ఉన్న భూమి వివాదంలో చిక్కుకుపోయింది. చాలా మంది హిందువులు రాముడు జన్మించిన కచ్చితమైన ప్రదేశంలోనే మొఘల్ చక్రవర్తి బాబర్ మసీదు నిర్మించాడని నమ్ముతారు. అక్కడే రామాలయం నిర్మించాలని ఐదు దశాబ్దాలుగా పోరాటం చేశారు. ఐదు దశాబ్దాల వివాదానికి 2019, నవంబర్ 9న భారత అత్యున్నత న్యాయస్థానం పరిష్కరించింది. హిందువులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వివాదాస్పద భూమిలో రామాలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు.
ఇంజినీరింగ్ అద్భుతం..
అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తయ్యింది. ఇది ఒక ఇంజినీరింగ్ అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. ఇనుము, ఉక్కు, సిమెంట్ వంటి ఏ ఆధునిక వస్తువులను ఉపయోగించకుండా ఆలయం నిర్మించారు. వెయ్యి ఏళ్లపాటు ఎలాంటి విపత్తులు వచ్చినా తట్టుకునేలా నిర్మించారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ బన్సీ పహర్‌పూర్ నుంచి ప్రత్యేకమైన గులాబీ రాయిని తెప్పించి మందిరం నిర్మించారు. ఆలయం భూకంపాలను తట్టుకోగలదు. దీని బరువు చాలా తక్కువగా ఉంటుంది.
రాళ్లపై ఇన్‌ట్రికేట్ ప్యాటర్న్ అద్భుతంగా చెక్కారు. పొడవైన కమ్మీలు, లాక్స్‌తో వీటిని ఒకదానికొకటి ఫిట్ చేశారు. బైండింగ్ ఏజెంట్ లేదా గ్లూ అవసరం లేకుండా చేశారు. ఈ టెక్నాలజీతో టెంపుల్ స్టేబుల్‌గా ఉంటుంది. వేల ఏళ్లు మన్నగలుగుతుంది. పురాతన నాగారా నిర్మాణ శైలిలా ఎన్నో ఏళ్లు మన్నుతుంది.
నాగారా శైలి ప్రత్యేకత..
నాగారా శైలి అనేది ఉత్తర భారతదేశంలోని మూడు ప్రధాన హిందూ ఆలయాల నిర్మాణ శైలుల్లో ఒకటి. మిగతావి ద్రవిడ, వేసరి శైలులు. నాగారా శైలిలో ఎత్తయిన, వంపు తిరిగిన టవర్ ఉంటుంది. ఇది ప్రధాన మందిరంపై ఉంటుంది. ఈ శైలి అనేక గదులు, వరండాలతో రెక్టాంగులర్ లేఔట్ ఉంటుంది. ఈ నాగారా శైలి వింధ్య, హిమాలయాల మధ్య ప్రాంతంతో ముడిపడి ఉంది. దీని నిర్మాణంలో ఇనుము ఉపయోగించరు. ఖజురహో, సోమనాథ్, కోణార్క్ ఆలయాలు నాగారా శైలిలోనే నిర్మించారు.
నిర్మాణంలో అనేక సవాళ్లు..
రామమందిరం కోసం పునాది నిర్మించడంలో ఇంజినీరింగ్ అధికారులు అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. భూసార పరీక్షలో దిగువన ఉన్న భూమి వదులుగా, ఇసుకతో నిండి ఉన్నట్లు గుర్తించారు. ఇది భారీ నిర్మాణానికి పనికిరాదని తేల్చారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి సీబీఆర్‌ఐ, నేషనల్ జియోఫిజికల్ సర్వే, ఢిల్లీ ఐఐటీ, గౌహతి, చెన్నై, రూర్కీ, బాంబేతో పాటు లార్సెన్ – టూబ్రో (ఎల్ అండ్ టీ) సహా వివిధ సంస్థల నిపుణుల బృందం ఒక వినూత్న పరిష్కారాన్ని రూపొందించింది. ఇంజినీర్లు ఆరు ఎకరాల భూమిలో 14 మీటర్ల మందంతో ఉన్న ఇసుకను తొలగించారు. అందులో 56 పొరల రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీటు నింపారు. ఇది కాలక్రమేనా రాతిగా గట్టిపడుతుంది. ఆలయానికి బలమైన పునాదిగా మారింది.