కొన్ని తప్పిదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశం బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగింది. కేటీఆర్ మాట్లాడుతూ ‘ఇప్పుడు తెలంగాణ.. ఢీల్లీ చేతుల్లోకి వెళ్లింది. మన చేతుల్లోకి తెచ్చుకునే సమయం వచ్చింది. కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉంది’ అని కేటీఆర్ అన్నారు.