మీడియా ప్రతినిధిపై దిల్ రాజు ఫైర్…

స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్స్ దిల్ రాజు మీడియా ప్రతినిధి పై ఫైర్ అయ్యాడు. పిచ్చిపిచ్చిగా రాస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చాడు. అడ్డు వచ్చిన వారిని ఏం పీకుతున్నారంటూ అరిచాడు. వీడియో తీస్తున్న వ్యక్తి మీద కూడా అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. సంక్రాంతి సీజన్ వచ్చిందంటే దిల్ రాజు కేంద్రంగా పంచాయితీలు షురూ అవుతాయి. గుంటూరు కారం డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు మిగతా సినిమాలకు థియేటర్స్ ఇవ్వడం లేదనే వాదన ఉంది.

 

More

From Entertainment

తనను టార్గెట్ చేస్తూ వార్తలు రాస్తున్నారని నిన్న దిల్ రాజు ఆవేశానికి గురయ్యాడు. కొన్ని పేరున్న మీడియా సంస్థలు తమ ప్రయోజనాల కోసం వేరొకరికి గురించి ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. నేను చాలా కాలం సహించాను. ఓపిక నశించింది. ఇష్టం వచ్చినట్లు రాస్తే తాట తీస్తానని దిల్ రాజు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చాడు. దిల్ రాజు కామెంట్స్ వైరల్ అయ్యాయి. అదే రోజు ఒక పాత్రికేయుడితో దిల్ రాజు వాగ్వాదానికి దిగాడు.

 

అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. అడ్డువచ్చిన వాళ్లపై కూడా అరిచాడు. గతంలో ఎన్నడూ దిల్ రాజు ఈ రేంజ్ లో రచ్చ చేయలేదు. గత ఏడాది దిల్ రాజు వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలకు థియేటర్స్ లేకుండా లాక్ చేస్తున్నాడనే వివాదం నడిచింది. ఆయన నిర్మించిన వారసుడు చిత్రానికి మెజారిటీ థియేటర్స్ కేటాయించినట్లు వార్తలు వచ్చాయి. వారసుడు విడుదల జనవరి 14కి వాయిదా పడటంతో చిరంజీవి, బాలయ్యల చిత్రాలకు ఇబ్బంది లేకుండా పోయింది.

 

ఈ ఏడాది ఐదారు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఒకరిద్దరు వెనక్కి తగ్గాలని మీటింగ్స్ జరిగాయి. ఎట్టకేలకు రవితేజ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈగిల్ మూవీని ఫిబ్రవరికి పోస్ట్ ఫోన్ చేశాడు. హనుమాన్ సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పించాలని ఎంత ప్రయత్నం చేసినా, వాళ్ళు వెనక్కి తగ్గలేదు. హనుమాన్ చిత్రానికి దిల్ రాజు అసలు థియేటర్స్ ఇవ్వలేదనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో ఆయనపై వస్తున్న విమర్శలకు దిల్ రాజు కౌంటర్ ఇచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *