తేది: 03-03-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: గ్రామంలో కోతుల బెడద నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కల్పించడానికి మల్యాల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బొట్ల జయ, ప్రసాద్ బోనును తయారు చేయించి తేది02-03-2026, సోమవారం పంచాయతీ కార్యాలయంలో అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తన సొంత ఖర్చులతో ఊళ్లోని కోతులను బోనులో బంధించి, అనంతరం వాటిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టనున్నారు. గ్రామంలో నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగిస్తే కోతుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.