ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ కలయికలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప-2’ ది రూల్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. ఈ చిత్రం విడుదలకు ముందే పలు కొత్త రికార్డులను క్రియేట్ చేసిన ఈ ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ విడుదల తరువాత సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. విడుదలైన తొలిరోజే నుంచే అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ విషయంలో ఆల్‌టైమ్ రికార్డులు నెలకొల్పుతున్న పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తుంది. ముఖ్యంగా వందేళ్ల హిందీ సినీ చరిత్రలో ‘పుష్ప-2’ చిత్రంతో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.
ఇప్పటి వరకు హిందీ సినీ చరిత్రలో ఏ సినిమా కలెక్ట్ చేయని విధంగా కేవలం 15 రోజుల్లోనే 632 కోట్ల 50 లక్షల రూపాయాల వసూళ్లను సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘పుష్ప-2′ దిరూల్ ఆ ఘనతను దక్కించుకుంది. ఇప్పటి వరకు హాయ్యెస్ట్ వసూళ్లను సాధించిన చిత్రంగా ఉన్న’స్త్రీ2’ చిత్రం లైఫ్ టైమ్ రన్‌ను కేవలం 15 రోజుల్లోనే పుష్ప-2 అధిగమించడం విశేషం. దీంతో పాటు అత్యంత వేగంగా 14 రోజుల్లోనే రూ.1500 కోట్ల రూపాయాలు సాధించిన తొలి భారతీయ చిత్రంగా, కేవలం ముంబయ్‌లోనే 200 కోట్ల రూపాయాల నెట్‌ను వసూలు చేసిన తొలిచిత్రంగా పుష్ప-2 రికార్డు క్రియేట్‌చేసింది. ఇక 2024 సంవత్సరంలో హ్యాయ్యెస్ట్ గ్రాస్‌ను సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డును నమోదు చేసింది. అల్లు అర్జున్ తన కెరీర్‌లో పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ చిత్రాలతో 2021 మరియు 2024లో బ్యాక్ టు బ్యాక్ హ్యాయెస్ట్ గ్రాసర్స్ వసూలు చేసిన ఇండియన్ సినిమాల హీరోగా కూడా కొత్త రికార్డను సాధించాడు. భవిష్యత్‌లో పుష్ప-2 ది రూల్ లాంగ్ రన్‌లో మరిన్ని సరికొత్త రికార్డులు ఐకాన్ స్టార్ సొంతం చేసుకోబోతున్నాడని అంటున్నాయి ఇండియన్ ట్రేడ్ వర్గాలు.