గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేసిందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలన్న ఆలోచన, తపనతో ప్రతి క్షణం పని చేస్తున్నామని, ప్రజలు కోరుకున్న మార్పు తీసుకొస్తామని తెలిపారు. బుధవారం ఎఫ్టీసీసీఐ, ఫిక్కి, సీఏఏ, ఎఫ్టీఎస్ఏసీ, డిక్కి సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీని తీసుకొస్తామని, పరిశ్రమ రంగంలోనూ మార్పు వస్తుందన్నారు.