బోధన్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి అయేషా ఫాతిమా అమెర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శనివారం విద్యార్థులకు గిఫ్ట్‌లు, నోట్‌బుక్స్, ఇతర సామగ్రిని అందజేశారు. బోధన్ మండలం అందాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అయేషా జన్మదినం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులతో కలిసి ఆమె జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.
పేద విద్యార్థుల మధ్య తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని కలిగించిందని అయేషా ఫాతిమా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు తన ట్రస్ట్ ద్వారా ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల చదువుకు అవసరమైన సహాయాన్ని అందించడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అందాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు 300 స్కూల్ యూనిఫామ్స్, 100 స్కూల్ బ్యాగ్స్ అందజేశారు. విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందించడం పట్ల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.