నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని పేర్కొంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ధరలను నియంత్రించి ప్రజలకు ఉపశమనం కల్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియకు వినతిపత్రం అందజేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో కుటుంబాలపై అదనపు భారం పడుతోందని వారు జేసీ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలను పర్యవేక్షించి.. అధిక ధరలకు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. సామాన్య ప్రజల కొనుగోలు శక్తిని దృష్టిలో ఉంచుకుని ధరల నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు, మాజీ డిప్యూటీ మేయర్, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.