హైదరాబాద్: గచ్చిబౌలి బ్రహ్మకుమారిస్ వారి ఆధ్వర్యంలో ఇవాల్యుయేటింగ్ లీగల్ అండ్ పర్సనల్ సక్సెస్ కార్యక్రమానికి హాజరైన త్రిపుర జస్టిస్ అమర్నాథ్ గౌడ్ మరియు జస్టిస్ ఈశ్వరయ్య గార్ల పిలుపుమేరకు సకాలంలో తెలంగాణ న్యాయవాదులు హాజరై వివిధ అంశాల పైన సత్సంగంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఇట్టి తరుణంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయవాద వ్యవస్థ గురించి, న్యాయవాదుల ప్రాముఖ్యత మరియు నేటి సమాజంలో న్యాయవాదుల పాత్ర గురించి ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకొని విశ్లేషణాత్మకంగా తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ సంతోష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్ గౌడ్ అడ్వకేట్, జగదీశ్వర్ గౌడ్ అడ్వకేట్, కృష్ణ అడ్వకేట్, వై భగవంతరావు అడ్వకేట్ పాల్గొన్నారు.