మంత్రి శ్రీధర్ బాబుపై హరీష్ సంచలన వాఖ్యలు..!

రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు ఒక చీకటి రోజు అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యం గొంతు కోసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో మంత్రి శ్రీధర్ బాబు యాక్షన్ నడుస్తుందని హరీష్ రావు ఆరోపించారు.

 

అసెంబ్లీ బయట ప్రశ్నిస్తే కేసులు, అక్రమ అరెస్టులు.. ప్రశ్నిస్తే సస్పెన్షన్, గొంతు నొక్కడం ఏంటని హరీష్ రావు ఫైరయ్యారు. ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు సస్పెండ్ చేస్తారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, సభ్యులు మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే స్పీకర్ వారిని అదుపు చేసి, సభా పెద్దగా శాసనసభను క్రమంలో పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు అసెంబ్లీలో ప్రజల సమస్యపై మాట్లాడే అవకాశం ప్రతిపక్షాలకు లేకుండా చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ గా ప్రసాద్ ప్రతిపాదించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని చెప్పారు.

 

‘దేశంలో ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పింది. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పార్టీ పేరు పెట్టింది కేసీఆర్. దేశంలో ఎక్కడా లేనివిధంగా 10 లక్షల దళిత బంధు పథకం ప్రవేశపెట్టింది కేసీఆర్. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ దళితుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బాబు జగ్జీవన్ రావు కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే వారు కొత్త పార్టీ పెట్టుకున్న విషయం కూడా అందరికీ తెలుసు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అధీర్ రంజన్ చౌదరి , సోనియా గాంధీ ద్రౌపది ముర్ముని అవమానించారు’ అని చెప్పుకొచ్చారు.

 

‘స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు, మంత్రి శ్రీధర్ బాబుకు బీఆర్ఎస్ తరఫున శాసనసభ్యులను వెళ్లి వివరణ ఇచ్చాం. జగదీష్ రెడ్డి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. అలా మీరు భావిస్తే రికార్డులను చూపించాలని కోరాం. సభ జరగాలి కాబట్టి మా తప్పు ఉన్నట్లయితే మేము క్షమాపణ చెప్పి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటాం. ఈ రోజు ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా సభ సమయాన్ని వృథా చేయకుండా ఉండాలని కోరాం. ఉరి తీసేటప్పుడు కూడా మీ చివరి కోరిక ఏమిటి అని అడుగుతారు. సస్పెండ్ చేసిన సభ్యుని వివరణ కూడా అరగకుండా సస్పెండ్ చేయడం దుర్మార్గం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తప్పు చేయకపోయినా సభలో క్షమాపణ చెబుతామని కూడా చెప్పాం. పథకం ప్రకారం ముందే అనుకొని బీఆర్ఎస్ సభ్యుడిని సస్పెండ్ చేశారు’ అని హరీష్ రావు ఫైరయ్యారు.

 

ప్రశ్నించే ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ను కుట్రపూరితంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. స్పీకర్ పై జగదీశ్ రెడ్డి ఏక వచనం వాడకపోయినా ఏక వచనం వాడారని సస్పెండ్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కౌల్ అండ్ శక్దర్ పుస్తకంలో ఎక్కడ కూడా యు అనే పదాన్ని నిషేధించలేదు. అయినా సరే మేము ఎక్కడ స్పీకర్‌ను ఏక వచనంతో సంబోధించలేదు. రాహుల్ గాంధీ మీరు చెప్పే ప్రజాస్వామ్య పరిరక్షణ ఇదేనా..? ఇదేనా ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం అంటే..? ప్రశ్నించే వారిని పగబట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్నది. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో మంత్రి శ్రీధర్ బాబు యాక్షన్ నడుస్తుంది’ హరీష్ రావు వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *