జమిలి బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ.. కీలక కమిటీలో ఏపీ నుంచి ఈ ముగ్గురికి చోటు..!

లోక్ సభలో ఆమోదం పొంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలకు పంపిన నేపథ్యంలో.. కమిటీని ఏర్పాటు చేస్తూ లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభ, రాజ్య సభ నుంచి సభ్యుల్ని ఈ కమిటీలో చోటు కల్పించిన లోక్ సభ స్పీకర్.. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలకు చోటు కల్పించారు. దీంతో.. ఈ కమిటీ జమిలి బిల్లును పరిశీలించి తర్వాత జరగనున్న పార్లమెంట్ సమావేశాల సమయానికి నివేదిక సమర్పించనుంది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన పార్లమెంట్ సంయుక్త కమిటీలో భాజపా తరఫున అనురాగ్‌ ఠాకూర్‌ చోటు దక్కించుకోగా.. కాంగ్రెస్‌ తరఫున ప్రియాంకా గాంధీ తదితరులకు కేంద్రం చోటు కల్పించింది. కాగా.. ఈ కమిటీలో మొత్తంగా పలు పార్టీలకు చెందిన 21 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంన్నారు.

 

జేపీసీలో సభ్యులు వీరే..

 

కీలకమైన సంయుక్త పార్లమెంటరీ సంఘం ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ మంత్రి పార్లమెంట్ లో డిసెంబర్ 19 గురువారం రోజున ప్రవేశపెట్టనున్నారు. కాగా.. ఇందులో సభ్యులుగా పీపీ చౌదరి, సీఎం రమేశ్‌, బాన్సురీ స్వరాజ్‌, పురుషోత్తమ్‌ రూపాలా, అనురాగ్‌ ఠాకూర్‌, విష్ణు దయాళ్‌రామ్‌, భర్తృహరి మహ్తాబ్‌, సంబిత్‌ పాత్రా, అనిల్‌ బలూనీ, విష్ణుదత్‌ శర్మ, ప్రియాంకా గాంధీ వాద్రా, మనీష్‌ తివారీ, సుఖదేవ్‌ భగత్‌, ధర్మేంద్ర యాదవ్‌, కల్యాణ్‌ బెనర్జీ, టీఎం సెల్వ గణపతి, జీఎం హరీశ్‌ బాలయోగి, సుప్రియా సూలే, శ్రీకాంత్‌ శిందే, చందన్‌ చౌహాన్‌, వల్లభనేని బాలశౌరి ఉన్నారు. వీరితో పాటు రాజ్యసభ నుంచి 10 మంది సభ్యుల పేర్లను ప్రతిపాదించారు.

 

రాజ్యసభ నుంచి సభ్యుల పేర్ల క్లారిటీ వచ్చిన తర్వాత తదుపరి కమిటీ ఛైర్మన్‌ను కేంద్రం ప్రకటించనుంది. ఈ కమిటీ జమిలి బిల్లును పూర్తిగా పరిశీలించి.. వచ్చే పార్లమెంటు సమావేశాల చివరి వారంలో పార్లమెంట్ కు నివేదిక సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. లోక్ సభ నుంచి 21 మంది ఎంపిక కాగా వారిలో ఏపీలోని కూటమి ప్రభుత్వం నుంచి ముగ్గురికి చోటు కల్పించారు. వారిలో టీడీపీ నుంచి హరీష్ బాలయోగి, బీజేపీ నుంచి సీఎం రమేష్, జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి ఖరారైయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *