పక్కా ప్లానింగ్ తో గేమ్ చేంజర్..! ఈసారి పక్క బ్లాక్ బస్టర్ అవుతుందా..?

దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కెరియర్ స్టార్టింగ్ లోనే చాలా క్రితం ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను సౌత్ సినిమా ఇండస్ట్రీకి అందించాడు. శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అని అంటే ఎన్నో అంచనాలు ఉండేవి. రీసెంట్ టైమ్స్ లో శంకర్ తీసిన సినిమాల ఫలితాలు తేడా కొట్టడంతో శంకర్ సినిమా మీద కొద్దిపాటి అంచనాలు తగ్గాయి అనేది వాస్తవం. శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా అప్పట్లో ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అప్పట్లో శంకర్ ఆ కథను డిజైన్ చేసి డైరెక్ట్ చేసిన విధానం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటికీ ఆ సినిమాని చూసినప్పుడు అదే రకమైన ఫీలింగ్ కలుగుతుంది. అటువంటి సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 అనే సినిమాను తెరకెక్కించాడు శంకర్.

 

ఎన్నో అంచనాల మధ్య వచ్చిన భారతీయుడు 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమాకి విపరీతమైన నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. చాలామంది చరణ్ అభిమానులు కూడా నెక్స్ట్ రాబోయే గేమ్ చేంజెర్ సినిమా ఎలా ఉండబోతుందో అని సందేహం కూడా వ్యక్తం చేశారు. అయితే భారతీయుడు 2 సినిమా గురించి శంకర్ కూడా రెస్పాండ్ అయ్యాడు. భారతీయుడు 2 సినిమాకి అంత నెగిటివ్ రివ్యూస్ వస్తాయి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది పర్వాలేదు. నేను బెటర్ అవుట్ పుట్ డెలివరీ చేయడానికి గేమ్ చేంజెర్ సినిమాలో ట్రై చేశాను. ఆ సినిమా అవుట్ పుట్ చూసిన తర్వాత ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇట్స్ ఏ షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అంటూ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు శంకర్.

 

గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదివరకే రిలీజ్ అయిన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జనవరి 10వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధిస్తుంది అని కొంతమంది సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి కారణం ఈ సినిమాకి కథ అందించిన కార్తీక్ సుబ్బరాజ్. మొదట కార్తీక్ సుబ్బరాజు కథ రాసుకున్నప్పుడు వాళ్ళ చిత్ర యూనిట్ అంతా కూడా ఇది శంకర్ సార్ రేంజ్ లో ఉంది అని చెప్పడంతో ఈ కథను డైరెక్ట్ గా శంకర్ కి ఇచ్చేశాడు కార్తీక్. ఇప్పుడు కార్తీక్ రాసిన ఈ కథను శంకర్ ఏ రేంజ్ లో డైరెక్ట్ చేశాడు అనేది చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *