షామీర్పేట్, మల్కాజిగిరి పార్లమెంట్ కాన్స్టెన్సీ మెంబర్ అఫ్ పార్లమెంట్ శ్రీ ఈటెల రాజేందర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ కు నిధులు మంజూరు చేయాలని బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంలో మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టెన్సీ మెంబర్ అఫ్ పార్లమెంట్ ఈటల రాజేందర్ గారు సవినయంగా ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ విజ్ఞప్తి పత్రాన్ని స్వీకరించి స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చుటకు ఎల్లప్పుడూ సంపూర్ణ మద్దతు ఉంటుందని అందుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ జి.సాయ గౌడ్, ఆధ్యాత్మిక ధ్యాన గురుమాత అనురాధ గారు మరియు స్వాతంత్ర సమరయోధుల ఆశయాల కోసం పోరాడుతున్న సభ్యులు పాల్గొన్నారు.