- స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చుటకు కట్టుబడి ఉంటాం- రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య.
హైదరాబాద్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం భవన్ లో ఆంధ్ర ప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసి స్వాతంత్ర సమరయోధుల ఆశయాలు నెరవేర్చుటకు నిధులు మంజూరు చేయాలని బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు.ఈ తరుణంలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కష్టపడి సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిదీ అని కొనియాడుతూ స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ వారి ఆశయ సిద్దికై కట్టుబడి ఉంటానని సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తానని తెలియజేశారు. ఈ యొక్క సమావేశము లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ సాయ గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.