తేది:12-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇన్చార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా: దేశ వ్యాప్తంగా ఉన్న అమెరికన్ బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ (ఏబీఎఫ్ఎమ్ఎస్) ఆస్తులు రక్షణ కోసం మూడు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం న్యాయస్థానాల్లో గెలిచింది. కానీ హన్మకొండ మిషన్ హాస్పిటల్ బాపిస్ట్ చర్చి ఆస్తులతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆస్తులు ఇప్పటికీ కబ్జాదారుల గుప్పిట్లోనే ఉన్నాయి..
పేద వారికి చందాల్సిసిన ఆస్తుల ఫలాలను కొంత మంది హై కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి ధర్జాగా అనుభవిస్తున్నారు. బీద క్రైస్తవ ప్రజల కు చెందాల్సి స్థలాలను కబ్జాదారులతో కొంత మంది పాస్టర్లు వారి స్వలాభాలకు వేరే భూ కొనుగోలుదారులకు అమ్మకాలకు మరియు కబ్జాలకు సహకరిస్తున్నారని క్రిస్తావా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్నీ సీపీ దృష్టికి మరియు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వరకు ఈ సమస్యను చేరే వరకు బీద క్రైస్తవులకు న్యాయం చేకూరే ల చూస్తాను అని పీఏబీసీ డైరెక్టర్ మంద సురేష్ బాబు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మిగితా క్రైస్తవ సంఘాల నాయకులు, పాస్టర్ లు తదితరులు పాల్గొన్నారు.