పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), శిరోమణి అకాలీదళ్ మధ్య మరోసారి పొత్తు కుదిరింది. ఆరేళ్ల క్రితం ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన అకాలీదళ్ తాజాగా తిరిగి కూటమిలో చేరింది. దీంతో పంజాబ్లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.
శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరు పార్టీల మధ్య పొత్తుపై చర్చలు జరగ్గా, ఎన్డీఏలో తిరిగి చేరాలని అకాలీదళ్ నిర్ణయించినట్లు సమాచారం.
ఈ మేరకు అకాలీదళ్ ఇకపై ఎన్డీఏ భాగస్వామిగా కొనసాగుతుందని అధికారిక ప్రకటన వెలువడింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ, అకాలీదళ్ కలిసి పోటీ చేయనున్నట్లు వెల్లడించాయి. ఈ పొత్తుతో పంజాబ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడనున్నాయి.