కరీంనగర్ సెంట్రల్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావును మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సంఘ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు.
అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కార్మికులు సంఘంగా ఏర్పడి తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం సంఘ కార్యాలయం అద్దెతో పాటు ఇతర నిర్వహణ ఖర్చులను సభ్యులే సొంతంగా భరిస్తున్నామని సునీల్‌రావు దృష్టికి తీసుకెళ్లారు.
పెరుగుతున్న అద్దెలు, నిర్వహణ వ్యయాల దృష్ట్యా సొంత సంఘ భవనాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నామని, అందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించి కార్మికులకు సహకరించాలని డిప్యూటీ మేయర్‌ను కోరారు. కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిశీలించాలని కూడా విజ్ఞప్తి చేశారు.