ప్రముఖ జానపద గాయని కోమలి నిర్మాతగా మారి, కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై సోమేష్ సారిపల్లితో కలిసి నిర్మించిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో దినేష్ కుమార్ హీరోగా నటిస్తుండగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు.
ఈ సినిమా జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు సినీ ప్రముఖులు హాజరై చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తూ రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా విశేషాలను పంచుకున్న చిత్రబృందం, జూలై 17న థియేటర్లలో సినిమా చూసి ఆదరించాలని ప్రేక్షకులను కోరింది.