24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల..!

దేశంలోని 24 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్‌ను ఎలక్షన్ కమీషన్ ఆప్ ఇండియా విడుదల చేసింది. ఏపీ, కర్ణాటక, గుజరాత్‌లలో 4 స్థానాల చొప్పున ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో మూడు స్థానాలకుగాను ఎన్నికలు జరగనున్నాయి. ఇక జార్ఖండ్‌లో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానలంన్నింటికి నామినేషన్లు దాఖలు చేయాలని కోరుతూ ఎలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

నామినేషన్లు విత్ డ్రా..

జూన్ 8వ తేది వకరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు ఎన్నికల కమీషన్ తెలిపింది. జూన్ 11 తేదిన నామినేషన్లు విత్ డ్రా చేసుకునేందుకు ఎన్నికల కమీషర్ గడువును ఇచ్చింది. దేశంలో జూన్ 18 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలీంగ్ జరగనుందని ఎన్నికల సంఘం తెలిపింది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడి కానున్నాయని తెలిపింది. దీంతో జూన్ 20 నాటికి ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమీషన్ పూర్తిచేయనుంది.

 

ముగిసిన పదవి కాలం..

ఆంద్రప్రదేశ్ నుండి పిల్లి సభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ ల పదవికాలం ఈ నెల 26 వతేదిన ముగిసింది. దీంతో ఈ నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహింనున్నారు. వీరి స్థానంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎవరిని నిలపెడుతుంది అనే అంశం పై ఉత్కఠ నెలకొంది