జెన్ జెడ్’ బాటలో రాజకీయ పార్టీలు, ఆ దారిలోనే జనసేన..?

జెన్ జెడ్ ఉద్యమాలు దేశంలోని రాజకీయ పార్టీలకు చెమటలు పడుతున్నాయి. ఎన్నికలు వచ్చేసరికి పాత పార్టీలను పక్కన పెట్టేస్తున్నాయి. అందుకు ఎగ్జాంఫుల్.. రీసెంట్‌గా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు. నాలుగైదు దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీలను పక్కన పెట్టేసి విజయ్ పార్టీకి అందలం ఎక్కించారు ఓటర్లు. తాాజగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ జెన్ జెడ్ వాయిస్ వినిపించాలని ఆలోచన చేశారు.

 

‘జెన్ జెడ్’ బాటలో రాజకీయ పార్టీలు, ఆ దారిలో పవన్‌కల్యాణ్

 

ఇండియా చుట్టూ ఉన్న దేశాల్లో జెన్ జెడ్ ఉద్యమాలతో ప్రభుత్వాలు పతనమయ్యాయి. ఫలితంగా దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీలు పాతానికి పడిపోతున్నాయి.. పోయాయి కూడా. అందుకు ఎగ్జాంఫుల్ శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలే ఉదాహరణ. అక్కడి ఫలితాలకు అనుగుణంగా మన దేశంలోని రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి.

 

అంతెందుకు ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు ఓటర్లు నాలుగైదు దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీలను పక్కన పెట్టేశారు. కొత్తగా వచ్చిన విజయ్ పార్టీకి అందలం ఎక్కించారంటే జెన్ జెడ్ ఛాయలు దేశాన్ని తాకుతున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో దేశంలోని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి.

 

జెన్ జీ యువత ఆలోచనలు.. కొత్తగా సేనా గళం ఏర్పాటు

 

అరచేతిలో టెక్నాలజీ వచ్చినా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందడం లేదు. ఫలితంగా యువతలో అసహనం క్రమంగా పెరుగుతోంది. అందుకే పాత పార్టీలను పక్కన పెట్టేస్తున్నారు. కొత్త పార్టీలకు అవకాశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో యూత్ వాయిస్ బలంగా వినిపించే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పుట్టుకొచ్చింది.

 

ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ జెన్ జెడ్ బాటలో అడుగులు వేస్తున్నారు. రీసెంట్‌గా టీడీపీ మహానాడులో సీఎం చంద్రబాబు జెన్ జెడ్ రాగాన్ని ఆలపించారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వంతైంది. అందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలు తమ పాత పంథాను మార్చుకునే పనిలో పడుతున్నాయి.

 

ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన ప్రధాన ఆఫీసులోని ముఖ్య నేతలతో భేటీ అయ్యారు అధినేత పవన్ కల్యాణ్. జనసేనలో అంతర్గతంగా ప్రత్యేక కమిటీ ఏర్పాటుపై దృష్టి సారించారు. అనుచిత వ్యాఖ్యలు, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన చర్యలపై కమిటీ సభ్లులు స్పందిస్తున్నారు. అదే సమయంలో జెన్ జెడ్ లేదా జెన్ జీ యువత ఆలోచనలు, ఆశయాలను అర్థం చేసుకోవాలన్నారు.

 

కాలం మారుతోందని, నవతరం జెన్ జీ ఆలోచనలు భిన్నంగా ఉంటున్నాయని చెప్పుకొచ్చారు. కుళ్ళు-కుట్రలు, కుతంత్రాలు లేని రాజకీయాలను నేటి తరం కోరుకుంటుందని, తొలి అడుగుగా జనసేన ముందుకు వెళ్లాలన్నారు. బూజుపట్టిన విధానాలకు తిలోదకాలు ఇవ్వాలని చెబుతూ ‘సేనా గళం’ పేరుతో పార్టీలో అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు అధినేత. సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ ముఖ్యంగా జెన్ జీ యువత ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యమన్నారు జనసేనాని.