తేది:20-04- 2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా : ఝరాసంగం మండల పరిధిలోని బొప్పాన్ పల్లి చౌరస్తాలో జగజ్యోతి బసవేశ్వరుని జయంతి ఉత్సవాలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చౌరస్తాలో ఉన్న బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.
”కాయకమే కైలాసం” అని చాటిచెప్పిన మహనీయుడు బసవేశ్వరుడని, ఆయన చూపిన మార్గం నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. కులమతాలకు అతీతంగా సమానత్వాన్ని కాంక్షించిన గొప్ప సంస్కర్త బసవన్న అని వారు పేర్కొన్నారు.
పాల్గొన్న ప్రముఖులు,ఈ ఉత్సవాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.వినోద బాలరాజ్ సర్పంచ్,ఝరాసంగం మండల ముఖ్య నాయకులు
మాజీ ఎంపీటీసీలు,వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు మరియు గ్రామ పెద్దలు,భక్తులు, బసవ అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విగ్రహం వద్ద హారతులు ఇచ్చి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంతో కప్పాడు చౌరస్తా ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది.