లా కాలేజీ, సుబేదారి. లా’ కన్వెన్షన్ పోస్టర్ ఆవిష్కరణ ప్రొఫెసర్ ఏం. శ్రీనివాస్ డీన్ లా డిపార్ట్మెంట్ కేయూ.

తేది:20-04-2026 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.

వరంగల్ జిల్లా: ఎస్ఎఫ్ఐ లా కమిటీ నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన లా విభాగం డీన్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాస్ ఎస్.ఎఫ్.ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 25న కేయూలో నిర్వహించే న్యాయ విద్యార్థుల లా కన్వెన్షన్ పోస్టర్ను కళాశాల ఆవరణలో విడుదల చేశారు. మారిన సమాజానికి అనుగుణంగా న్యాయ విద్యలో ఆధునికీకరణ తీసుకురావాల్సిన మార్పుల గురించి న్యాయవిద్యను అందరికీ అందుబాటులో ఉంచాలని రాజ్యాంగంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించ జరిగే ఈ కన్వెన్షన్ విజయవంతానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయ కళాశాల విద్యార్థులు, న్యాయవాదులు, రిటైర్డ్ జడ్జిలు అలాగే పరిశోధక విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు స్టాలిన్ అధ్యాపకులు ప్రభాకర్ హరిప్రసాద్ పద్మజ సుజాత వేదస్రీ లక్ష్మణ్, విద్యార్థులు సీను సాత్విక్ సంధ్య రానా శరత్ వైష్ణవి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *