టాలీవుడ్‌లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటి సుధ తన సినీ జీవితంలోని ఆసక్తికర అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కెరీర్ ప్రారంభ దశలో నటనతో పాటు చదువును కూడా కొనసాగించాలని తన తల్లి ఎప్పుడూ ప్రోత్సహించేదని ఆమె తెలిపారు.
ఒక దశలో సినిమాలకు విరామం ఇచ్చి విద్యాభ్యాసంపై దృష్టి పెట్టినప్పటికీ, తన మనసు మాత్రం ఎప్పుడూ సినిమాల చుట్టూనే తిరిగేదని సుధ గుర్తుచేసుకున్నారు. నటనపై ఉన్న ఆసక్తి ఎప్పుడూ తగ్గలేదని, అదే తనను మళ్లీ వెండితెరకు తీసుకొచ్చిందని చెప్పారు.
అలాంటి సమయంలో ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ నుంచి అవకాశం రావడంతో తిరిగి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టానని సుధ వెల్లడించారు. ఆ అవకాశం తన కెరీర్‌కు కొత్త మలుపు తీసుకువచ్చిందని, ఆ తర్వాత వరుసగా విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందినట్లు ఆమె పేర్కొన్నారు.