అల్లీపూర్‌ లో మహాత్మ జ్యోతి పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాలను సందర్శించిన సీఈఓ గౌతమ్‌రెడ్డి.

తేది:20-04-2026 TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా: 99 ప్రజల పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా అల్లీపూర్‌ గ్రామంలో మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీ.సీ సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాలను సీఈఓ గౌతమ్‌రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజన సౌకర్యాలను, వంట సామాగ్రి నాణ్యతను,శౌచాలయం ఆయన పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిరంజీవి, గ్రామ ఇన్‌ఛార్జ్ సెక్రెటరీ శ్రీహరి, అనుమల్ల రాజ్‌కుమార్, 8వ వార్డు సభ్యులు, కారోబార్ రాజేందర్, మహాత్మ జ్యోతి పూలే ప్రిన్సిపాల్ స్వప్నకుమారి, అసిస్టెంట్ ప్రిన్సిపల్ గంగ ప్రసాద్, డిప్యూటీ వార్డెన్ కిషోర్, హెల్త్ సూపర్వైజర్ నరేష్ చారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *